Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో సార్వత్రిక పోలింగ్ ఎపుడు?

ఠాగూర్
శనివారం, 16 మార్చి 2024 (16:26 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. మే 13వ తేదీన 17 లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ నాలుగో తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగే పోలింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు కూడా మే 13వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం నిర్వహించింది. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు మంది ఉండగా వీరిలో పురుష ఓటర్లు 49.7 కోట్ల మంది, మహిళా ఓటర్లు 47.1 కోట్ల మంది ఉన్నారు. వీరిలో తొలిసారి ఓటు వేయనున్న యువ ఓటర్లు 1.85 కోట్ల మంది. 48 వేల మంది హిజ్రాలు ఉన్నారు. 88.4 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. 
 
12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడొచ్చు. అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరు తెలుసుకోవచ్చు. అభ్యర్థిపై ఉన్న క్రమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు యాప్‌లో చూడొచ్చు. తాయిలాలు, నగదు పంపిణీ జరిగే ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. మీ మొబైల్ ఫోను లొకేషన్‌ను బట్టి మీ ప్రాంతానికి 100 నిమిషాల్లో ఎన్నికల అధికారులు చేరుకుంటారు అని రాజీవ్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments