రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

సెల్వి
బుధవారం, 25 జూన్ 2025 (09:57 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు చాలామంది. తాజాగా ప్రభుత్వ పథకం కింద తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడు తన తండ్రి నాలుక కోసిన సంఘటన హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో కలకలం రేపుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి వుంది. రైతు భరోసా కింద ఆరువేల రూపాయలు అతన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ డబ్బు కోసం కీర్యా చిన్న కొడుకు సంతోష్ పట్టుపట్టాడు.

అయితే కీర్యా ఇటీవల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కీర్యా రూ.2,000 వైద్యం కోసం ఖర్చు చేశానని.. మిగతా రూ.4,000 ఇస్తానని చెప్పాడు. కానీ ఈ సమాధానం సంతోష్‌కు నచ్చక కోపంతో ఊగిపోయాడు. 
 
ఆ డబ్బుకోసం వేధించాడు. దాడి చేశాడు. చివరికి సంతోష్ తన దగ్గర ఉన్న కొడవలి తీసుకొని కీర్యా నాలుక కోశాడు. ఈ దారుణ దాడితో తీవ్ర గాయాలపాలైన కీర్యా రక్తపు మడుగులో విలవిల్లాడుతుండగా.. గమనించిన స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments