కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురిపై కామంతో విరుచుకు పడ్డాడు. కూతురి శరీర భాగాలు తాకుతూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తాగిన మైకంలో తన కూతురి శరీర భాగాలు తాకుతూ.. వేధించాడు. దీంతో ఆ బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.