Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (09:17 IST)
హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతితెలివి ప్రదర్శించాడు. తాను లంచాల రూపంలో తీసుకునే డబ్బును చెత్త డబ్బాలో వేసి, ఇంటికి వెళుతూ వెళుతూ దాన్ని తీసుకెళ్లేవాడు. ఈ విషయం పసిగట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) మాటు వేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు...
 
ఈ నెల 15వ తేదీన శామీర్‌పేట పరిధిలో ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి రూ.2.42 లక్షల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సూర్య, అఖిలేశ్‌లు ఈ చోరీకి పాల్పడినట్టు నిర్ధారించి, వారిద్దరిని ఈ నెల  15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించే క్రమంలో మరో వ్యక్తి ఈ నూనె డబ్బాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 
 
ఈ కేసును విచారిస్తున్న శామీర్‌పేట్ ఎస్ఐ ఎం పరశురాం... నూనె డబ్బాలు కొనుగోలు చేసిన వ్యక్తిని ఈ నెల 20వ తేదీకి ఠాణాకు పిలిచి, కేసు నుంచి తప్పించుకోవాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన బాధితుడు మరుసటిరోజు రూ.2 లక్షలు తీసుకొచ్చి ఎస్ఐ కారులో పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎస్ఐ మరోమారు కాల్ చేసి రూ.2 లక్షల్లో రూ.25 వేలు తక్కువగా ఉందని, ఆ సొమ్ము కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు బాధితుడు రూ.22 వేలు ఇచ్చేందుకు సమ్మతించాడు. 
 
ఆ తర్వాత ఎస్ఐ నుంచి వేధింపులు పెరగడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ బయట మాటువేసి, బాధితుడుని డబ్బుతో లోపలికి పంపించారు. ఎస్ఐ దగ్గరకు వెళ్ళిన బాధితుడు.. రూ.22 వేలు తీసుకొచ్చామని చెప్పగా, టేబుల్ పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పడంతో బాధితుడు కూడా అలానే చేశాడు. ఆ తర్వాత ఎస్ఐ పరశురాం డబ్బులు తీసి లెక్కిస్తుండగా, ఏసీబీ అధికారులు రైడ్ చేసి పరశురాం‌మ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments