Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

సెల్వి
శనివారం, 21 జూన్ 2025 (19:14 IST)
Harish Rao
తెలంగాణ మాజీ మంత్రి టి హరీష్ రావు నిరసన సమావేశంలో వైరల్ నినాదంతో కూడిన "రప్పా రప్పా 3.0 లోడింగ్" అనే బ్యానర్లు కనిపించాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీసింది.

పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్, ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, 2028 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి. రైతు భరోసా సహాయం నిరాకరించబడిన పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసనలో పాల్గొనడానికి హరీష్ రావు పాల్గొన్నారు. 
 
"రప్పా రప్పా" అనే డైలాగ్, హిట్ చిత్రం పుష్ప-2లో నటుడు అల్లు అర్జున్ పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈ వారం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా మద్దతుదారులు ఇదే రకమైన ఫ్లెక్సీలపై ప్రదర్శించబడిన తర్వాత వైరల్ అయ్యింది. అయితే ఈ ఫ్లెక్సీలు ఏపీలో వివాదాలకు దారి తీసింది. 
 
అయితే తెలంగాణలోనూ ప్రస్తుతం ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ.. 2028లో తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments