Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.... 11 విజ్ఞప్తులతో సీఎం రేవంత్ లేఖ

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (19:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన రెండు రోజుల పర్యటన మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సంకల్ప సభలలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ .. ఆ తర్వాత తమిళనాడు ప్యటనకు వచ్చారు. ఇది ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుని ఆ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. బుధవారం ఉదయం తెలంగాణాలో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. పటేలగూడ సభ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరివెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు తదితరులు ప్రధాన మోడీకి విడ్కోలు పలికారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి 11 విజ్ఞప్తులు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం, హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకారం, ఇంటింటికీ నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్  - రామగుండం, హైదరాబాద్ - నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, భారత్ మాలలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత, తెలంగాణాలో సెమీ కండక్టర్ల తయారీ తదిత అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని సీఎం రేవంత్ చేసిన విజ్ఞప్తుల్లో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments