Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌత్ ఫ్రెష్‌నర్ అనుకోని డ్రై ఐస్ తిన్నారు.. ఏమైందంటే? డ్రై ఐస్ ప్రమాదమా?

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (19:54 IST)
Dry Ice
గురుగ్రామ్‌లోని లాఫోరెస్టా కేఫ్‌లో మౌత్ ఫ్రెష్‌నర్ అనుకోని డ్రై ఐస్ తిన్న ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. వారికి చికిత్స అందించిన వైద్యుడు డ్రై ఐస్ అనే పదార్ధం మరణానికి దారితీస్తుందని హెచ్చరించారు. గురుగ్రామ్‌లోని ఓ రెస్టారంట్‌కు డిన్నర్‌ చేసేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు మౌత్‌ ఫ్రెష్‌నర్‌కు బదులుగా డ్రై ఐస్‌ తినడంతో రక్తం వాంతులతో తీవ్ర అశ్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. అసలేమిటీ డ్రై ఐస్‌.. ఇది తింటే ఏం జరుగుతోంది? అనే విషయాలు నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతికేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం.. డ్రై ఐస్ ప్రాణాంతక పదార్థం. ఒట్టి చేతులతో డ్రై ఐస్ తాకడం కూడా అత్యంత ప్రమాదకరం.
 
చేతులకు ఎల్లప్పుడూ గ్లౌజులు ధరించి మాత్రమే దీనిని వినియోగించాలి. డ్రై ఐస్‌తో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల చేస్తుంది. డ్రై ఐస్ సబ్లిమేట్ అయినప్పుడు అది కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. 
 
తగినంత వెంటిలేషన్‌లేని ప్రదేశాల్లో ఆక్సిజన్‌ స్థానభ్రంశం అయ్యేలా చేస్తుంది. ఇక డ్రై ఐస్‌ని తింటే ఏకంగా ప్రాణాలకే ముప్పు తలపెడుతుంది. నోరు, అన్నవాహిక, కడుపులోని కణజాలాన్ని స్తంభింపజేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments