డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

ఐవీఆర్
శనివారం, 21 జూన్ 2025 (15:11 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి జరిమానా చెల్లించకపోతే జైలుకు పోతావని పోలీసులు చేసిన హెచ్చరికతో భయపడిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా లోని ముదిగొండకు చెందిన 25 ఏళ్ల గోపి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చేస్తుండటంతో ఇతడు కూడా అక్కడికే మకాం మార్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని వస్తూవస్తూ మద్యం సేవించాడు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతుండటంతో పోలీసులకు పట్టుబడ్డాడు.
 
అనంతరం జూన్ 19న అతడికి పోలీసులు ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకి హాజరై జరిమానా కట్టాలనీ, లేదంటే జైలుకు వెళ్తావంటూ హెచ్చరించారు. దీనితో భయాందోళనలకు గురైన గోపి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై గోపీ భార్య ... తన భర్త మరణానికి పోలీసులు అతడిని భయపెట్టడమే కారణమంటూ బోరుమంటూ విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments