పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (14:59 IST)
నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలుపడ్డారు. శనివారం ఈ దోపిడీ జరిగింది. నెల్లూరు జిల్లా కావలి - వెంకటేశ్వరపాలెం మధ్య ప్రయాణిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. ఈ రైలు, కావలి స్టేషన్ దాటిన తర్వాత వేంకటేశ్వర పాలెం సమీపంలోని రాగానే గుర్తు తెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు
 
నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. వారివద్ద ఉన్న రూ.20 వేల నగదు, మొబైల్ ఫోన్ కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
దోడిపీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పారిపోయారు. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments