తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. గంజాయి సరఫరాదారులతో పాటు గంజాయి సేవించే వారు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు గంజాయి స్మగ్లర్లు ఓ పోలీస్‌ను ఢీకొట్టి, బైకుపై పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైకుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. ఇందుకోసం పోలీస్ కానిస్టేబుల్ బారిగేడ్‌ను అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, గంజాయి స్మగ్లర్లు మాత్రం పోలీసును ఢీకొట్టించి పారిపోయాడు. దీంతో బారికేడ్‍తో పాటు పోలీస్ కానిస్టేబుల్ కూడా కిందపడిపోయాడు.
కాగా, కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా, గంజాయి బ్యాచ్ బారికేడ్లను సైతం ఢీకొట్టించి పారిపోయాడు.