Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా కానిస్టేబుల్ హత్య : తమ్ముడు అరెస్టు

Advertiesment
crime

ఠాగూర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా కానిస్టేబుల్‌ నాగమణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నాగమణిని హతమార్చిన ఆమె తమ్ముడు పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడిపై బీఎన్‌ఎస్‌ 103 (1) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. పరువు హత్యతో పాటు ఆస్తి వివాదం కోణంలో విచారణ చేస్తున్నారు. పరమేశ్‌కు సహకరించిన నిందితుల కోసం మూడు బృందాలతో ఇబ్రహీంపట్నం పోలీసులు గాలిస్తున్నారు. 
 
కులాంతర వివాహం చేసుకుందనీ... 
తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు చేసిన పెళ్లిని తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్  ఉద్యోగం చేసే అక్కను సోదరుడు కడతేర్చాడు. డ్యూటికి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీకొట్టించి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయపోలుకు చెందిన నాగమణి అనే మహిళా కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలో వివాహం కాగా, పది నెలల క్రితం విడాకులు తీసుకుంది. 
 
నెల రోజుల తర్వాత కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుటుంబ పరువు పోయిందని నాగమణి సోదరుడు ఆవేశంతో ఊగిపోయాడు. అక్కపై కక్ష పెంచుకున్న సోదరుడు.. నాగమణి డ్యూటీకి వెళఅలే సమయంలో కారుతో ఢీకొట్టించడంతో కిందపడిపోయాడు. 
 
ఆ తర్వాత వేటకొడవలితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. జనమంతా చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నాగమణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో హై అలర్ట్.. భారీ వర్షాలు... అయ్యప్ప భక్తులు బురదలో ప్రయాణం..