ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (16:44 IST)
తన ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరకు విగతజీవిగా మారాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి మరొకరితో నిశ్చితార్థం జరగడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దొంచంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి లండన్‌లో టెక్కీగా పని చేస్తున్నాడు. ఈయనకు ఏరుగట్ల గ్రామానికి చెందిన అఖిలను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ విషయంపై ఇరు కుటుంబాల సభ్యులతో మాట్లాడి, వివాహం చేసుకోవడానికి శ్రీకాంత్ రెడ్డి లండన్ నుంచి గ్రామానికి వచ్చాడు. అయితే, అఖిలకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన ప్రియురాలు చేసిన పనిని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఏరగట్ల గ్రామంలో మృతదేహాన్ని పోలీస్ వాహనంపై ఉంచి నిరసన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments