తెలంగాణ లోని సత్తుపల్లిలో దారుణం విషాదకర సంఘటన జరిగింది. తనతో పెళ్లయినప్పటికీ భార్య మరొక యువకుడితో ప్రేమలో పడటంతో అతడు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను ఆమె ప్రియుడితో పెళ్లి చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సత్తుపల్లి పట్టణంలో షేక్ గౌస్ తన భార్యతో కలిసి వుంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్న గౌస్, ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో భార్యాపిల్లల్ని తీసుకుని సత్యంపేట గ్రామానికి వలస వెళ్లాడు.
అక్కడ వ్యవసాయం చేసి కాస్తోకూస్తో డబ్బు కష్టాలు తీర్చుకోవచ్చని ప్రయత్నం చేసాడు. ఇంతలో అతడి భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుంది. వీళ్లిద్దరూ ఏకంతంగా వుండటాన్ని గౌస్ గమనించాడు. ఐతే తన భార్యను ఏమీ అనకపోగా.. వాళ్లిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడి, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ కనుక పెళ్లి చేస్తానని చెప్పాడు. అందుకు వారు షాక్ తిన్నారు. వాళ్లను ఒప్పించి బుధవారం రాత్రి వారికి పెళ్లి చేసాడు. అనంతరం పొలానికి బయలుదేరి వెళ్లిపోయాడు.
నిన్న పొలం నుంచి ఓ వీడియో కాల్ ద్వారా తను చేసిన పనిని తన స్నేహితులకు చెప్పాడు. ఐతే తన భార్యను విడిచి వుండలేకపోతున్నాననీ, అలాగని ఆమె ప్రేమించినవాడిని ఆమెకి దూరం చేయలేను కనుక ఆత్మహత్య చేసుకోవడం మంచిదని తెలిపాడు. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడు అఘాయిత్యం చేసుకుంటున్నాడని తెలియజేసే లోపుగానే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి మరణించడం, తల్లి మరొకర్ని పెళ్లి చేసుకోవడంతో వారి పిల్లలు దిక్కులేని అనాధలయ్యారు.