Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

సెల్వి
శుక్రవారం, 3 జనవరి 2025 (19:20 IST)
కుమారి ఆంటీ వ్యాపారం ఈరోజు ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమె వ్యాపారాన్ని మూసివేయాలని ఆదేశించారు. కుమారి ఆంటీ తన రోడ్డు పక్కన ఉన్న తన స్టాల్‌ను వారానికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
కుమారీ ఆంటీ వ్యాపారానికి లైసెన్స్ లేదు, దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ, ఆమె వ్యాపారంపై వార్తలు, మీమ్స్, రీల్స్‌తో నిండి వున్నాయి. కుమారి ఆంటీ, ఒకప్పుడు సాధారణ ఫుడ్ స్టాల్ ఓనర్. ఇప్పుడు తన ఫాలోవర్స్ వల్ల సోషల్ మీడియా సెలబ్రిటీ. 
 
గతంలో, నిరంతరం ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఆమె స్టాల్ తొలగించబడింది. అయితే ప్రజల డిమాండ్ తర్వాత ఆమె స్టాల్ తిరిగి ప్రారంభం అయ్యింది. నిజానికి గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమె స్టాల్‌ను మళ్లీ ప్రారంభించేలా చూసుకున్నారు. 2011లో కుమారి ఆంటీ 5 కేజీల బియ్యంతో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ ఎదురుగా తన స్టాల్‌ను ఏర్పాటు చేసింది. 
 
ఈరోజు మౌత్ పబ్లిసిటీ వల్ల, దూరప్రాంతాల నుంచి వచ్చే వారి వల్ల కుమారి ఆంటీ రోజుకు 100 కిలోల బియ్యంతో వ్యాపారం చేస్తోంది. ఆమె నెలకు రూ.18 లక్షలు సంపాదిస్తున్నట్లు అంచనా. ఆమె చేసే మాంసాహార వంటకాలకు భారీ డిమాండ్ వుంది. అయితే పోలీసులు వచ్చి తన వ్యాపారాన్ని మూసివేయమని చెప్పడంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఆమె సోషల్ మీడియా క్రేజ్‌తో ఆమె ఆహారాన్ని రుచి చూడటానికి చాలా మంది రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments