Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌కి అప్‌గ్రేడ్ కావాలని కోరుకునే ఎక్ఛేంజ్ ప్రయోజనంతో లాయల్టీ ప్రోగ్రామ్‌

ROYAL ENFIELD

ఐవీఆర్

, శనివారం, 21 డిశెంబరు 2024 (22:19 IST)
మిడ్-సైజ్ (250సీసీ-750సీసీ) మోటార్‌సైకిల్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, నేడు తన ప్రీ-ఓన్డ్ మోటార్‌సైకిల్ వ్యాపారం రీఓన్ (REOWN)ను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోని 236 నగరాల్లోని వినియోగదారులు, రాయల్ ఎన్‌ఫీల్డ్ (RE) ఔత్సాహికులు ఇప్పుడు తమ ప్రస్తుత మోటార్‌సైకిళ్లను సౌకర్యవంతంగా విక్రయించుకోవడం, ఉత్తేజకరమైన, సామర్థ్యం గల లైనప్ నుంచి కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడ్‌కు తేలికగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు. రీఓన్, ప్రీ-ఓన్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లను కొనుగోలు చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు పారదర్శక ప్లాట్‌ఫారమ్ కాగా, ఇవి ఎంపిక చేసిన నగరాల్లో 2023 నుంచి సేవలు అందిస్తున్నాయి.
 
దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసే 236 నగరాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 475 డీలర్‌షిప్‌ల ద్వారా రీఓన్ (REOWN) వినియోగదారులకు అందుబాటులో ఉంది. విశ్వసనీయత, స్వచ్ఛమైన మోటార్‌సైక్లింగ్ అనుభవాన్ని మిళితం చేసే పలు రకాల మోటార్‌సైకిళ్లను అందించాలనే కంపెనీ నిబద్ధతకు ఇది మద్దతు ఇస్తుంది. నెట్‌వర్క్ విస్తరణతో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్ఛేంజ్ ప్రయోజనాలతో తన మొట్టమొదటి లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా REOWN, RE-to-RE ఎక్ఛేంజీల ద్వారా ప్రీ-ఓన్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ నుంచి కొత్తదానికి అప్‌గ్రేడ్ కావాలని కోరుకునే వినియోగదారులకు ఎక్ఛేంజ్ ప్రయోజనాలతో పరిచయం చేసింది.
 
రీఓన్ విస్తరణపై రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, “రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో, రైడింగ్ ఔత్సాహికులకు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని సొంతం చేసుకోవడంలో ఆనందాన్ని అందించేలా మేము నిరంతరం ఆవిష్కరణలు చేస్తున్నాము. కేవలం ఎంపిక చేసిన నగరాల నుంచి 236 నగరాలను ఒక ఏడాదిలో కవర్ చేసేందుకు రీఓన్ విస్తరణ అనేది ఔత్సాహికులకు ఇది వారి మొదటి లేదా ప్రతిష్టాత్మకమైన అప్‌గ్రేడ్ అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను సొంతం చేసుకునేందుకు అంతరాయం, చికాకులు లేని, పారదర్శకమైన మార్గాన్ని అందజేస్తామన్న మా వాగ్దానానికి విస్తరింపు’’ అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ వినోదాలతో క్రిస్మస్ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇనార్బిట్ మాల్ సైబరాబాద్