Karthika Pournami Special : కార్తీక పౌర్ణమి- తెలుగు రాష్ట్రాల్లో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు

సెల్వి
బుధవారం, 5 నవంబరు 2025 (10:09 IST)
Karthika Pournami
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లులో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా అమరావతి వంటి ఇతర ప్రసిద్ధ శైవ క్షేత్రాలు కూడా భక్తులతో నిండిపోయాయి. 
 
వేకువజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు కార్తిక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 
 
బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివయ్యను దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. నది తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలను నీటిలో వదులుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments