Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ప్రేమించకుంటే నిన్ను కాల్‌గర్ల్‌గా మార్చేస్తా... యువతికి యువకుడి బెదిరింపు

ఠాగూర్
మంగళవారం, 9 జనవరి 2024 (12:39 IST)
తనను ప్రేమించాలంటా ఓ యువతికి ఓ యువకుడు బెదిరించాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో తనలోని మరో కోణాన్ని ఆ యువకుడు బయటపెట్టాడు. నన్ను ప్రేమిస్తే సరేసరి.. లేదంటే నువ్వు కాల్‌గార్ల్‌ వంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ హెచ్చరించాడు. 
 
ఇలా అనునిత్యం వేధిస్తుండటంతో భరించలేని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ జూబ్లీహి్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కృష్ణానగర్‌కు చెందిన 20 యేళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.

రెండేళ్ల క్రితం ఆమెకు ఇందిరా నగర్‌కు చెందిన ఖయ్యూంతో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో తన అవసరాల నిమిత్తం అతడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని, ఆ తర్వాత వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేసింది. 
 
ఆ తర్వాత నుంచి ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. దీనికి ఆమె నో చెప్పింది. 
 
అప్పటి నుంచి ఖయ్యూం ఆమెపై కక్ష పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ లాక్కొని, స్కూటర్‌ను ధ్వంసం చేశాడు. 
 
ఈ నెల 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి బయట నుంచి పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడాడు. ప్రేమించకుంటే కాల్‌గర్ల్‌వని ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments