బోనాలు ప్రారంభం.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (11:00 IST)
బోనాల సందర్భంగా జులై 28న మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. జూలై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఉత్తర్వుల్లో తెలిపారు. 
 
బోనాల పండుగను పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని అవినాష్ మొహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  హైదరాబాద్ నగరంలో ఆషాడ మాసం చివరి ఆదివారం బోనాల వేడుకలు ప్రారంభమైనాయి. 
 
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా పాతబస్తీ బోనాలు జరుగుతాయి. ఈ బోనాల వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
అందులో భాగంగా నగర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యంపైనా నిఘా ఉంటుందని.. ఎవరైనా బ్లాక్‌లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments