Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు.. కేకలు వేయడంతో పరుగో పరుగు (Video)

Advertiesment
victim girl

వరుణ్

, శుక్రవారం, 26 జులై 2024 (11:48 IST)
నేటి సమాజంలో మహిళల మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. పట్టపగలే మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఓ మహిళపై కామాంధుడు ఒకడు ఘాయిత్యం చేయబోయాడు. అయితే, ఆ మహిళ అప్రమత్తమై బిగ్గరగా కేకలు వేయడంతో ఆ యువకుడు పారిపోయాడు. 
 
మొగల్‌పూరలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూసి హత్తుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన మహిళ వెంటనే కేకలు వేయడంతో యువకుడు పారిపోయాడు.. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ ఒక కొలంబియా మాఫియా కింగ్ పాబ్లో ఎస్కొబార్‌ : సీఎం చంద్రబాబు