హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (09:43 IST)
ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడి హైదరాబాద్ బిర్యానీ అరుదైన ఘనత సాధించింది. టేస్ట్ అట్లాస్‌ ర్యాంకుల్లో పదో స్థానం లభించింది. టాప్ 50లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ వంటకం హైదరాబాద్ బిర్యానీ కావడం గమనార్హం. ఈ జాబితాలో అధికంగా జపనీస్ వంటకాలే చోటు దక్కించుకున్నాయి. 
 
ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025లో హైదరాబాద్ బిర్యానీ ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే టాప్ 50లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం.
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్ సమీక్షలు, పర్యాటకులు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా టేస్ట్ అట్లాస్ ఈ ర్యాంకింగ్‌ను ఖరారు చేసింది. భారత్ లక్నో, కాశ్మీరీ, కోల్‌కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కి నెట్టి హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది.
 
అయితే, ఈ జాబితాలో జపనీస్ వంటకాలదే ఆధిపత్యం కొనసాగింది. తొలి మూడు స్థానాల్లో నెగిటోరోడాన్, సుషీ, కైసెన్హాన్ వంటి జపనీస్ వంటకాలు నిలిచాయి. ఇదే జాబితాలో ఇరాన్‌కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం మరో ఆసక్తికరమైన విషయం. ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments