పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (14:39 IST)
భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు పెళ్లైన రెండు నెలలకే తనువు చాలించింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం సాలె బంజరకు చెందిన మాలోతు శ్రీనివాస్, నాగమణి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె పూజిత. అదే గ్రామానికి చెందిన జాటోతు శ్రీనివాస్‌ అనే యువకుడికి ఇచ్చి ఏప్రిల్‌ 16న ఘనంగా పెండ్లి చేశారు.  శ్రీనివాస్‌ హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ సర్వీస్‌ రోడ్డులో ఉన్న ఒక నగల దుకాణంలో సేల్స్‌మాన్‌గా పనిచేస్తున్నాడు. 
 
పెండ్లి తర్వాత అక్కడికి సమీపంలోని టెంపుల్‌ బస్టాప్‌ దగ్గర కాపురం పెట్టారు. పెళ్లికి ముందు బంధువులతో కలిసి కూల్ డ్రింక్స్ తాగిన వీడియోను శ్రీనివాస్‌కు వాట్సాప్‌లో వచ్చింది. అందులో శ్రీనివాస్‍‌కు పడని వారు కూడా వున్నారు. తనకు పడని వారితో పూజిత కూల్‌డ్రింక్స్ తాగిందని శ్రీనివాస్ వేధింపులకు గురి చేశాడు. 
 
పూజిత ఎంత నచ్చజెప్పిన శ్రీనివాస్‌ తీరు మారలేదు. దీనితో మనస్తాపానికి గురైన పూజిత శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంపై పూజిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments