Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీలకు విభిన్న రుచులను పరిచయం చేస్తూ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌

ఐవీఆర్
ఆదివారం, 28 జనవరి 2024 (21:48 IST)
యునెస్కో చేత క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ఎంపిక  చేయబడిన హైదరాబాద్‌లోని భోజన ప్రియులను ఆకట్టుకుంటూ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌  గుజరాత్ టూరిజం నిర్వహించింది. ఈ ఫెస్టివల్‌లో ప్రామాణికమైన గుజరాతీ వంటకాలను నగర వాసులు ఆస్వాదించారు. హోటల్ మేరిగోల్డ్‌లో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ గుజరాత్ యొక్క మహోన్నత పాక శాస్త్ర వారసత్వంలోకి అతిథులను తీసుకువెళ్లింది. అసలైన గుజరాతీ వంటకాల రుచిని అందించింది. గుజరాతీ ఆహార సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ఆకట్టుకునే ప్రదర్శనలతో హోటల్‌ను అలంకరించారు. 
 
ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా పాల్గొన్న గౌరవనీయమైన అతిథి జాబితాలో పర్యాటక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కృపాకర్ పవిపాటి, శ్రీశాంతి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ప్రిన్సిపల్ శ్రీ నరేంద్ర, టాట్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్, ఎస్‌కె ఏ ఎల్ సెక్రటరీ శ్రీ మోనిన్, యుఎఫ్‌టి‌సి ఛైర్మన్ శ్రీ సిరాజ్ ఉన్నారు. మినీ హంద్వో, పత్రా, ఖాండ్వీ, ధోక్లా, ఖమాన్, ఫుల్‌వాడి, బటాటా వాడా, మెథినా గోటా వంటి సాంప్రదాయ గుజరాతీ స్నాక్స్‌ని అందించడంతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
 
తదుపరిది ప్రధాన కోర్సు, గుజరాత్ యొక్క పాక శాస్త్ర వైవిధ్యాన్ని ప్రదర్శించింది. అతిథులు కోబిజ్ నో సంభారో, సెవ్ తమేతను షాక్, లసానియా బతక, రింగన్ నో ఓలో, వాల్, మాగ్ నీ లచ్కో దాల్, భరేలీ దుంగలి ను షాక్, గుజరాతీ కాధీ, రాజ్‌వాడీ కాధీ, భట్, ఫుల్కా రోటీ, బజ్రీ నో రోట్లో, వాఘారేలో రొట్లో, కచుంబార్, పాపడ్, మసాలా ఛష్ మరియు అథాను వంటి వంటకాలను సంతోషకరమైన సంభాషణల మధ్య ఆస్వాదించారు. అతిథులుకు చుర్మా నా లడు, లాప్సి, అంగూరి బాసుడి, రాజ్‌భోగ్ మాథో, దూధి నో హల్వో, సుఖ్దీ వంటి సాంప్రదాయ గుజరాతీ డెజర్ట్‌లను కూడా అందించారు. ఆకర్షణీయమైన వీడియోలు ప్రతి వంటకం యొక్క క్లిష్టమైన తయారీని ప్రదర్శించాయి. 
 
ఈ ఫుడ్ ఫెస్టివల్ కి  హైదరాబాద్ లోని ఆహారప్రియుల నుండి అపూర్వ ప్రశంసలు లభించాయి. సాంప్రదాయ గుజరాతీ వంటల ఆస్వాదన ఒక ప్రత్యేక అనుభవం, ప్రత్యేకించి గుజరాతీ కమ్యూనిటీ సభ్యులకు సాంప్రదాయ రుచులు జ్ఞాపకాలలోనికి తీసుకువెళ్ళింది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments