స్నేహితులే పొట్టనబెట్టుకున్నారు.. యువతి ప్రేమ కోసం కత్తితో పొడిచి చంపేశారు... (video)

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:54 IST)
Engineering student
స్నేహితులే ఆ యువకుడిని పొట్టనబెట్టుకున్నారు. యువతి ప్రేమ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్యకు గురైనాడు. బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్ ఏకైక పుత్రుడు.  ఎంవీఎస్ఆర్‌ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 
 
గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలాపూర్‌ గణేశ్‌ చౌక్‌ వద్ద స్నేహితులకు ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్‌ కడుపులో మూడుసార్లు పొడిచాడు. 
 
ప్రశాంత్‌ రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ప్రశాంత్‌ అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments