సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. ఈ మేరకు కొండాపూర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 17 మంది మహిళలను కూడా పోలీసులు రక్షించారు.
పక్కా సమాచారంతో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, గచ్చిబౌలి పోలీసులతో కలిసి కొండాపూర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళలు టూరిస్ట్, మెడికల్ వీసాపై దేశానికి వచ్చారు. వారిలో కొందరి వీసా గడువు ముగిసింది.
రక్షించబడిన వారిలో కెన్యాకు చెందిన 14 మంది, ఉగాండాకు చెందిన ఇద్దరు, టాంజానియాకు చెందిన ఒకరు ఉన్నారు. నిర్వాహకులు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.