Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి ఘటన.. పెళ్లై ఆరు నెలలు.. ఆమె నాలుగు నెలల గర్భవతి

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:37 IST)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎస్సైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
బుధవారం నాడు 17 మంది ప్రాణాలను బలిగొన్న పెను ప్రమాదం, గురువారం తమ బంధువుల మృతదేహాలను స్వీకరించేందుకు విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కెజిహెచ్) వద్ద గుమిగూడిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
 
రోదిస్తున్న కుటుంబాల్లో నాలుగు నెలల గర్భిణి అయిన నీలాదేవి అనే యువతి కూడా ఉంది. ఈ ప్రమాదంలో ఆమె తన భర్త చిరంజీవిని కోల్పోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మాకు కేవలం ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది, నేను నాలుగు నెలల గర్భవతిని" అని ఆమె దుఃఖంతో వణుకుతున్న స్వరంతో చెప్పింది.
 
''నా భర్త మరణవార్త విని చాలా బాధపడ్డాను. అతను లేకుండా భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలో, ఏమి చేయాలో నాకు తెలియదు" అని రోదించింది. అనకాపల్లి జిల్లా దార్లపూడికి చెందిన చిరంజీవి (24) 2023 నవంబర్‌ నుంచి యూనిట్‌లో ఫిట్టర్‌గా పనిచేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం