Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (13:50 IST)
తాను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, హైదరాబాద్ నగరంలో నీటి వనరుల సంరక్షణ కోసం హైడ్రా చేపట్టిన అక్రమ భవనాల కూల్చివేతలపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. హైడ్రా ఏర్పాటు, కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 
 
చెరువులు ఫుల్ ట్యాంకు లెవల్, బఫర్ జోన్‌లలో కట్టిన భవనాలు ఎంత పెద్దవారివైనా వదిలిపెట్టబోమన్నారు. ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే పలువురు ఆక్రమదారులకు, బడాబాబులకు నోటీసులు జారీచేసిందన్నారు. హైడ్రా పనితీరుపై సంతృప్తిగా ఉందన్నారు. అధికారుల పనిలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. కేవలం హైదరాబాద్ నగరం, నగరం చుట్టుపక్కల ఉన్న నీటి వనరుల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. 

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు మరోమారు పెంపు
 
ఆధార్ కార్డులోని తప్పొప్పులను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత అప్‌డేట్ గడువును మరోమారు పొడగించింది. ఈ మేరకు ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ నంబరు ఎంతో కీలకంగా మారింది. వ్యక్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డు అయిన ఆధార్.. మొబైల్ సిమ్ కార్డు కొనుగోలుకు మొదలు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, వాహనాలు, భూములు, ఇళ్లు క్రయవిక్రయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి అనేక అంశాలలో తప్పనిసరిగా మారిపోయింది. 
 
అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో మార్పులు వస్తుండటం సర్వసాధారణం. అంతేకాకుండా ఇంటి చిరునామాలు మారుతుండటంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతి పదేళ్లకు ఒక సారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది దశాబ్దాలు గడుస్తున్నా ఆధార్ అప్డేట్ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి అధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది.
 
ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో సారి పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్ అధికారిక వెబ్ సైట్ http://myaadhar.uidai.gov.in లో అధార్ నెంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments