కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో గొల్లప్రోలులో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు.
వరదలపై సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు చెప్పారు.
విజయవాడలో బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరు సంబంధించిన భూమిలో తెలిసో తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. ఆక్రమిత స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారు సైతం ఉన్నారని జనసేనాని తెలిపారు.