Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన డ్రైవర్.. గుండెపోటు.. సీటులోనే..

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (11:13 IST)
ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు వెళ్లిన కారు డ్రైవర్‌కు సీటులో ఉండగానే గుండెపోటు వచ్చింది. దీంతో సీటులోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బడంగ్ పేటకు చెందిన ధనుంజయ్ (41) అనే వ్యక్తి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. రోజులాగే శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన ధనుంజయ్... ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. పాతబస్తీ లాల్ దర్వాజ ప్ర్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి కారును తీసుకెళ్లాడు. 
 
కారు నల్లవాగు సమీపంలోకి చేరుకున్న ఆయనకు అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, కారును నియంత్రించలేక పోయాడు. దీంతో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్‌‍పై తలవాల్చేసి కనిపించాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ధనుంజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటువల్లే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments