Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్గపోరుతో నష్టపోయాం.. పార్టీ నేతలకు అమిత్ షా హెచ్చరిక

amit shah
, గురువారం, 28 డిశెంబరు 2023 (16:39 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్గ పోరు కారణంగానే నష్టపోయినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ నేతలకు హెచ్చరించారు. అందువల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి విభేదాలు, పొరపొచ్ఛాలు లేకుండా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన అమిత్‌ షా హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. '30 సీట్లు వస్తాయని ఆశించాం.. కానీ, అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్‌ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం' అని అమిత్‌ షా తెలిపారు. 
 
దేశంలోని ఏ పనికిమాలిన వెధవ ఆర్జీవికి ప్రమాదం తలపెట్టరు : నాగబాబు సెటైర్లు 
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని మెగాబ్రదర్, సినీ నటుడు నాగబాబు సెటైర్లు వేశారు. ఈ దేశంలోని ఏ పనికిమాలిన వెధవ కూడా వర్మకు హాని తలపెట్టరని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. 
 
"వ్యూహం" పేరుతో వర్మ జగన్ బయోపిక్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో వర్మ బిజీగా ఉన్నారు. అయితే, మూవీ రిలీజ్‌పై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ తన సినిమాలతో ఆర్జీవీ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్జీవీ.. ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
ఈ ఉదంతంపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఆర్జీవీపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే దేశంలోని ఏ పనికిమాలిక వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి' అని పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య!