Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ.. చర్యలు తీసుకోవాలంటూ బర్రెలక్క ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (12:22 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆమెను లక్ష్యంగా చేసుకుని రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బర్రెలక్క బర్రెలు కాస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బర్రెలక్క.. దర్శకుడు ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తరపున న్యాయవాది రాజేశ్ కుమార్ హైదరాబాద్ నగర పోలీసులతో పాటు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నెల 24వ తేదీన వర్మ స్వీయ నిర్మాణంలో వచ్చిన చిత్రం వ్యూహం. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకలో బర్రెలక్కను ఉద్దేశించి రామగోపాల్ వర్మ మాట్లాడుతూ, బర్రెలక్క బర్రెలు కాస్తుంది. బర్రెలు ఆమె మాటలు వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె మహళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 
 
మరోవైపు, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లకు వ్యతిరేకంగా వ్యూహం చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబరు 29వ తేదీ శుక్రవారం విడుదల కావాల్సివుంది. కానీ, ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయరాదంటూ తెలంగాణ హైకోర్టు గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్‌తో పాటు ఇతర ఆధారాలను జనవరి 11వ తేదీ లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments