పెద్దపులికి ఎలుగుబంటి చుక్కలు చూపించింది. నల్లమల అడవుల్లో ఎలుగుబంటి పెద్దపులికి సంబంధించిన ఫైట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. నల్లమల అడవుల్లో ఎలుగుబంటి పిల్లపై పెద్దపులి దాడికి దిగబోయింది. అయితే ఎలుగుబంటి తన బిడ్డను కాపాడుకునేందుకు పెద్దపులిపై తిరగబడింది.
పెద్దపులి నుంచి తన బిడ్డను రక్షించుకునేందుకు పెద్దపులిపై దాడి చేసేంది. దీంతో పెద్దపులి అడవుల్లోకి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.