Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

ఐవీఆర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (19:48 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
పట్టణాలు, నగరాల్లో వీధి కుక్కల బెడద విపరీతంగా వుంటోంది. పాదచారులను, ద్విచక్రవాహనదారులను వెంటబడి మరీ కరుస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరికొందరు ర్యాబిస్ వ్యాధి సోకి మరణిస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని హయత్ నగర్‌లో ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి చేసాయి.
 
శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాలుడిపై మూకుమ్మడిగా కుక్కలన్నీ మీదపడి కరిచాయి. ఈ దాడిలో బాలుడి చెవి తెగిపోయింది. కుక్కల దాడి సమయంలో బాలుడు ఆర్తనాదాలు విని స్థానికులు వెంటనే కుక్కల్ని తరిమి బాలుడిని రక్షించారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఏదోచోట వీధికుక్కల దాడుల్లో గాయపడుతున్నవారు వుంటూనే వున్నారు. కుక్కలను అదుపుచేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments