ఇటీవల అడవి జంతువులపై పరిశోధనలు చేసే ప్రొఫెసర్ బిలాల్ హబీబ్ ఓ అరుదైన దృశ్యాన్ని చూసారు. అదేమిటంటే... కుక్కతో తోడేలు సంపర్కం చేస్తూ కనిపించడం. ఈ కలయిక చాలా ప్రమాదకరమని ఆయన అంటున్నారు. వీటికి పుట్టే పిల్లలు తోడేలు స్వభావంతోనూ కుక్క స్వభావంతోనూ వుంటాయి. కుక్క మానవుల పట్ల విశ్వాసం కలిగి వుంటుంది. కానీ తోడేలు అలాక్కాదు. దాడి చేయడమే ప్రధానంగా వుంటుంది. మనుషులను చూస్తే ఇవి దాక్కుంటాయి.
కుక్క-తోడేలుకు పుట్టడం వల్ల కొన్నిసార్లు ఇవి కుక్కల్లా విశ్వాసంతోనూ, కొన్నిసార్లు తోడేళ్లలా ప్రమాదకరంగానూ ప్రవర్తిస్తాయి. చిన్నపిల్లలపై దాడులు చేసే స్వభావంతో వుంటాయి. తోడేలు లక్షణాల కారణంగా ఇంట్లో వున్నప్పటికీ కొరకడం, గుంతలు తవ్వడం వంటివి చేస్తాయి. ఈ లక్షణాలు కలిగిన తోడేలుకుక్క జాతి ఇంట్లో వుండటం కష్టతరంగా మారుతుంది. ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటాయి. అదేవిధంగా వోల్ఫ్ డాగ్ ఎవరినైనా కరిస్తే దాని ద్వారా రేబిస్ సోకితే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందో లేదో కూడా చెప్పలేమని అంటున్నారు.