Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

Advertiesment
Dog To Parliament

సెల్వి

, సోమవారం, 1 డిశెంబరు 2025 (19:26 IST)
Dog To Parliament
ఒకప్పుడు తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో పేరుగాంచిన రేణుకా చౌదరి క్రేజ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. అయితే తాజాగా రేణుకా చౌదరి తనతో పాటు ఒక కుక్కను పార్లమెంటుకు తీసుకువచ్చి కొత్త చర్చకు తెరలేపారు. ఈ సంఘటన త్వరగా రాజకీయ, ప్రజా దృష్టిని ఆకర్షించింది. 
 
బిజెపి శాసనసభ్యురాలు జగదాంబికా పాల్, ఎంపీగా తన అధికారాలను దుర్వినియోగం చేసిందని రేణుక ఆరోపించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ కుక్కను పార్లమెంటు ప్రాంగణం నుండి రేణుకా చౌదరి తిరిగి ఇంటికి పంపారు. 
 
ఈ చర్యను రేణుకా చౌదరి సమర్థించుకుంటూ, తాను రోడ్డు నుండి ఒక కుక్కపిల్లను తీసుకువచ్చానని.. ఆ కుక్కను కారు, మోటార్ సైకిళ్లు ఢీకొనేలా వుండటంతో దాన్ని తీసుకొచ్చానని తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై బీజేపీ చేస్తున్న కామెంట్లను ఏమాత్రం పట్టించుకోనని చెప్పారు. దేశవ్యాప్తంగా, వీధికుక్కలు వీధికుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం అంశం చర్చనీయాంశంగా మారింది. వీధికుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం పట్ల చాలా మంది మద్దతు ఇస్తుండగా, పెరుగుతున్న సంఘటనల కారణంగా మరికొందరు అసురక్షితంగా భావిస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ వద్దకు రేణుకా చౌదరి శునకాన్ని తేవడం మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ పేలుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు