Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ కేంద్రాలను వీడొద్దు.. కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ సూచన

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (08:54 IST)
పోలింగ్ కేంద్రాల్లో చివరి ఓటు లెక్కించేంత వరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను విడిచి రావొద్దని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. దీంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే విజయం అంటుండగా, గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయని బీఆర్ఎస్ అంటోంది. ఈ నేపథ్యంలో, ఫలితాల సరళిపై ఆసక్తి పెరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో వర్చువల్‌గా శనివారం సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటికి రావొద్దని స్పష్టం చేశారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించాలని నిర్దేశించారు. కౌంటింగ్ నేపథ్యంలో, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా శనివారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. హోటల్ తాజ్ కృష్ణ నుంచి ఆయన కౌంటింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. 
 
మినీ సార్వత్రిక సమరం : ఓట్ల లెక్కింపు ప్రారంభం 
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గత నెల రోజులుగా ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్లను లెక్కిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ను మొదలుపెట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.
 
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు తదితరులు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. 
 
భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్‌ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వెలువడవచ్చని అంచనా. చార్మినార్‌లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉన్నందున మిగిలిన రెండింటి కంటే దాని ఫలితమే మొదట తెలుస్తుందని భావిస్తున్నారు. 10 గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 సీట్ల ఆధిక్యంతో దూసుకెళుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments