Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మునుగోడు బరిలో 11 మంది స్థానికేతరులు

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (09:19 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి పోటీ చేస్తున్న వారిలో 11 మంది అభ్యర్థులు స్థానికేతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 11 మంది స్థానికేతరులు కావడం గమనార్హం. 
 
ఈ నియోజకవర్గ పరిధిలో చండూరు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు, గట్టుప్పల, మర్రిగూడ మండలాలు ఉన్నాయి. అయితే, ఈ దఫా ఇక్కడ నుంచి 39 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అందులో చండూరు మండలవాసులు ఒక్కరూ బరిలో నిలవలేదు. 16 మంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా, అత్యధికంగా సంస్థాన్ నారాయణపుర్ మండలానికి చెందిన వారు ఎనిమిది మంది బరిలో ఉన్నారు. 
 
వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి, బీజేపీ నుంచి చలమల్ల కృష్ణారెడ్డి, డీఎస్పీ నుంచి ఏర్పుల గాలయ్య ఉన్నా రు. అలాగే, మునుగోడుకు చెందిన వారు ముగ్గురు, మర్రిగూడకు చెందిన వారు ఐదుగురు, చౌటుప్పల్, నాంపల్లి, గట్టుప్పల మండలాలకు చెందిన వారు నలుగురు చొప్పున బరిలో నిలిచారు. 
w
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కేట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన వారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట, వలిగొండ, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, దేవరకొండ, కొండ మల్లేపల్లి మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, సరూర్ నగర్ మండలాలకు చెందిన ముగ్గురు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఒక్కరు చొప్పున పోటీలో ఉన్నారు.
 
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కోసం బరిలో ఉన్న అభ్యర్థుల్లో 39 మంది అభ్యర్థుల్లో ఒకరు నిరక్ష్యరాస్యులు కాగా మరొకరు ప్రకటించలేదు. ఒకరు పీహెచ్‌డీ, ఆరుగురు పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. ఆరుగురు పట్టభద్రులుగా ఉన్నారు. ముగ్గురు ఎల్‌ఎల్బీ చేశారు. ముగ్గురు బీటెక్, 12 మంది ఇంటర్ ఐదో పదో తరగతి, ఒకరు తొమ్మిదో తరగతి చదివారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments