Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక రాజ్యంగా తెలంగాణ.. టీడీపీ లేకుండా చేయాలని కుట్ర : ఎల్ రమణ

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (12:29 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతం వేరుపడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాజ్యంగా భావించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పాలన సాగించారని టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే దానిని తన కుటుంబ సభ్యులకు అన్వయించుకున్నారన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని మండిపడ్డారు మంత్రులకు, శాసనసభ్యులకు, చివరకు తనను ఎన్నుకున్న ప్రజలకు కూడా సమయం ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ అని రమణ విమర్శలు గుప్పించారు. 
 
హైదరాబాద్‌లో మంగళవారం మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి కేసీఆర్ కుట్రలు పన్నారని, ఎంతగానో ప్రయత్నించారన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున స్థాపించారని గుర్తుచేశారు. 
 
అన్ని పార్టీలతో కలిసి పాలన అభివృద్ధి సాధిస్తానని చెప్పిన కేసీఆర్ అన్ని పార్టీలను టిఆర్‌ఎస్‌లో కలుపుకొన్నారంటూ ఆయనపై రమణ నిప్పులు చెరిగారు. 30 మంది శాసనసభ్యులను ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకున్న రాజకీయ కుసంస్కారి అంటూ ఆగ్రహించారు. సమస్యలపై నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నా చౌక్‌ను తొలగించారన్నారు. కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని ప్రజలపై రుద్దుతున్నారని రమణ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments