Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓడిపోతానని తెలిసీ పోటీ చేస్తున్న మహిళా నేత..

Advertiesment
Akula Vijaya
, శనివారం, 24 నవంబరు 2018 (11:03 IST)
తాను ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి కూడా ఓ మహిళా నేత పోటీ చేస్తున్నారు. ఆమె పేరు ఆకుల విజయ. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన.. ఆమె ఈ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ఇక్కడ నామినేషన్ దాఖలుకు ముందే తాను ఓడిపోతానని ప్రకటించారు. అయినప్పటికీ పోటీ నుంచి విరమించుకునేది లేదని తేల్చి చెప్పారు.
 
సాధారణంగా ఎన్నికల్లో హేమాహేమీలతో పోటీ పడటం అంటే అంత సులభమైన విషయం కాదు. కానీ, ఆకుల విజయ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పోటీ చేస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి తెరాస నేత కేటీఆర్. ఈ ఎన్నికల్లో ఆకుల విజయకు 14,494 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
 
అలాగే, డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేస్తున్నారు. అయితే, ఈ దఫా తన స్థానం మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఈ స్థానం నుంచి తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ