Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : వరుసలో నిలబడి ఓటేసిన ప్రముఖులు..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (09:24 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ తర్వాత ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ సెంటర్లకు తరలివస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ముందుగానే చేరుకుని పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరారు.
 
* చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
* తెరాస సీనియర్ నేత వినోద్ ఓటు వేశారు. 
* తాజా మాజీ మంత్రి టి. హరీశ్ రావు దంపతులు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
* సూర్యాపేటలో తాజా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
* ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
* అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎల్లపల్లిలో తమ ఓటు వేశారు. 
* కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
* మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కొనాయిపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్‌ బేగంపేటలో పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments