సుహాసిని గెలిపించండి.. కూకట్‌పల్లి వాసులకు జగపతి బాబు విన్నపం

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:30 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీ చేస్తోంది. ఇందుకోసం ఆమె నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల ప్రచారం కూడా శ్రీకారం చుట్టారు. 
 
ఈ నేపథ్యంలో సుహాసిని టాలీవుడ్ హీరో జగపతి బాబు మద్దతు ప్రకటించారు. సుహాసిని ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయగలదని తాను నమ్ముతున్నానని జగపతి బాబు పేర్కొన్నారు. అందువల్ల కూకట్‌పల్లి ఓటర్లు ఆమెను గెలిపించాలని ఆయన కోరారు. 
 
కాగా, సుహాసినికి మద్దతుగా టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, నందమూరి తారక రామారావులు మద్దతు తెలిపి ప్రచారం చేయనున్నారు. అయితే, వీరి ప్రచార షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments