Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (08:26 IST)
భారతస్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ప్రపంచ సీనయిర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలను గెలుచుకున్నాడు. తద్వారా భారత తొలి రెజ్లర్‌గా నిలిచాడు. 
 
ఆదివారం సెర్బియాలోని బెల్ గ్రేడ్‌లో ముగిసిన తాజా సీజన్‌లో పూనియ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో పూనియా ఈ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీలో పూనియా క్వార్టర్ ఫైనల్‌లోనే ఓటమిపాలయ్యాడు. కానీ, అతడిని ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైఖేల్ ఫైనల్ చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెజిచేజ్ ద్వారా కాంస్య పతకం వరించింది. 
 
రెజిచేజ్‌ను పూనియా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తొలి బౌట్లో 7-6తో ఆర్మేనియాకు చెందిన వాజ్‌ బెజ్ తెవాన్యన్‌పై  నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక బౌట్‌లో పూనియ్ 11-9తో ప్యూర్టోరికోకు చెందిన సెబాస్టియన్ రెవిరా విజయం సాధించి పతకం గెలుచుకున్నారు. 
 
అలాగే, గత 2013లో 60 కేజీల విభాగంలో కాంస్యం, 2018లో 65 కేజీల విభాగంలో రజతం గెలిచిన బజ్ రంగ్ 2019లో కాంస్యం గెలిచాడు. మొత్తం ఏడు సార్లు పోటీపడ్డ అతను నాలుగు పతకాలతో ప్రపంచ చాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

తర్వాతి కథనం
Show comments