Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత స్ప్రింటర్ హిమాదాస్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (16:30 IST)
భారత పరుగుల రాణి హిమాదాస్‌ కరోనా వైరస్ సోకింది. ఆమెకు జరిపిన పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆమెకు పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌)లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. 
 
‘కోలుకోవడంతో పాటు ఇంతకు ముందు కంటే బలంగా తిరిగి వచ్చేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాను’ అని తెలిపింది. కొవిడ్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలంటూ ఆమె సూచన చేసింది. 
 
కాగా, హిమాదాస్‌ 2018లో అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో విజయం సాధించింది.. ఈ ఈవెంట్‌లో ప్రపంచ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా నిలిచింది. జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం హిమ కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టింది.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments