Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 February 2025
webdunia

ఏపీ పాఠశాలలపై కరోనా పంజా : విద్యార్థులకు - టీచర్లకు పాజిటివ్

Advertiesment
ఏపీ పాఠశాలలపై కరోనా పంజా : విద్యార్థులకు - టీచర్లకు పాజిటివ్
, సోమవారం, 23 ఆగస్టు 2021 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలపై కరోనా పంజా విసిరింది. అనేక పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ వైరస్ సోకింది. ఒకవైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాఠశాలల తలుపులు తెరుచుకున్నాయి. 
 
ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గుతుందని అంతా ఆశిస్తున్న వేళ మళ్లీ కేసులు పెరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన పాఠశాలలు వారం రోజుల క్రితం తెరుచుకున్నాయి. అయితే స్కూళ్లు పునఃప్రారంభమైన వారం రోజులకే విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. 
 
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 
 
అలాగే, కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
 
చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కొవిడ్ సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోనే పిల్లలకు వైరస్ సోకడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు