Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకినాడ జేఎన్టీయు గెస్ట్ హౌస్‌లో శోభనం : ప్రొఫెసర్ నిర్వాకం

Advertiesment
కాకినాడ జేఎన్టీయు గెస్ట్ హౌస్‌లో శోభనం : ప్రొఫెసర్ నిర్వాకం
, ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:42 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఉంది. చదువుల తల్లి సరస్వతీ దేవి నిలయమైన ఈ విశ్వవిద్యాలయాన్ని హనీమూన్ విడిగా మార్చి అపవిత్రంగా మార్చేశారు. ఈ పాడు పనికి పాల్పడింది ఓ ప్రొఫెసర్ కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాకినాడలోని జేఎన్‌టీయూ అతిథి గృహంలో నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. మొత్తం మూడు గదులు బుక్ చేయగా.. ఒక గదిలో శోభనం ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేశారు. 
 
ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణకుమారి గెస్ట్ హౌస్‌లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నవ దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలు, ఇలాంటి వేడుకలకు యూనివర్శిటీలో అనుమతి ఇవ్వరు. 
 
అయితే, నిబంధనలకు అతిక్రమిస్తూ.. శోభనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు. నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. 
 
ప్రఖ్యాతిగాంచిన జెఎన్‌టియు యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ,విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన విశ్వవిద్యాలయ కమిటీ విచారణకు ఆదేసించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొంప ముంచిన బుల్లెట్ బండి : డ్యాన్స్ అదరగొట్టిన నర్సు.. కలెక్టర్ సీరియస్