Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు చరిత్ర సృష్టించిన స్పెయన్ సంచలనం!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (10:28 IST)
స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ మరోమారు సంచలనం సృష్టించారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల అల్కరాజ్ 6- 2, 6-2, 7-6తో దిగ్గజ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు.
 
తొలి రెండు సెట్లలో అల్కరాజ్ జోరుకు ఎదురులేకుండా పోయింది. మూడో సెట్లో జకోవిచ్ నుంచి ప్రతిఘటన ఎదురు కాగా, ఆ సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో విజృంభించిన అల్కరాజ్ 7-4తో గెలిచి, జకోవిచ్‌పై చిరస్మరణీయ విజయం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ అనేక అనవసర తప్పిదాలు చేయడంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో టైటిల్‌ను తృటిలో కోల్పోయాడు. 
 
కాగా, 2023లోనూ కూడా అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. అప్పుడు కూడా జకోవిచ్ తోనే ఫైనల్ ఆడాడు. ఈ యేడాది ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ను ఖాతాలో వేసుకున్న స్పెయిన్ యువకిశోరం అల్కరాజ్, వింబుల్డన్‌ను కూడా చేజిక్కించుకుని ఈ ఏడాది రెండో మేజర్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments