Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకున్న జాగిల్ వ్యవస్థాపకుడు శ్రీరాజ్

Fintech Leader of the Year Award

ఐవీఆర్

, గురువారం, 4 జులై 2024 (20:42 IST)
తన వినూత్న నాయకత్వం, వ్యూహాలు, ఫిన్‌టెక్ పరిశ్రమకు అందించిన ముఖ్యమైన తోడ్పాటుని గుర్తిస్తూ BW ఫెస్టివల్ ఆఫ్ ఫిన్‌టెక్ కాన్‌క్లేవ్- అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన "ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డుతో జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ ఎన్ గుర్తింపు పొందారు.
 
వివిధ వ్యాపార విధులు, విభాగాలలో భాగస్వామ్యం, ఏకీకరణ అతని విధానం యొక్క ముఖ్య అంశం. టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్‌తో సహా క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి పని చేయడం ద్వారా, అతను బహుళ వ్యాపార కార్యక్రమాలను అమలు చేయగలుగుతున్నారు. ఈ భాగస్వామ్య  విధానం ప్రక్రియలను క్రమబద్ధీకరించింది, ప్రయత్నాల డూప్లికేషన్‌ను తగ్గించింది, కొత్త ఫిన్‌టెక్ ఉత్పత్తులు, సేవల కోసం మార్కెట్‌కి సమయాన్ని వేగవంతం చేసింది. 
 
"నిరంతర ఆవిష్కరణ, అభివృద్ధి అనేవి మిగిలిన వారికంటే ముందు ఉండటంలో అత్యంత కీలక పాత్ర పోషించటంతో పాటుగా స్థిరమైన వృద్ధిని సాధించడానికీ కీలకమైనవి" అని రాజ్ ఎన్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ వ్యూహంలో చురుకుదనం, మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడం, ఫీడ్‌బ్యాక్‌ను సేకరించడం వంటి వాటి ప్రాముఖ్యతను రాజ్ వెల్లడించారు. "వ్యూహం అనేది ఒక డైనమిక్ ప్రక్రియ, ఇది కొత్త సవాళ్లు మరియు అవకాశాలను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతుంది" అని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?