Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిగత క్లెయిమ్‌లకు సంబంధించి 2023-24లో పీఎన్‌బీ మెట్‌లైఫ్ 99 శాతం క్లెయిమ్ సెటిల్‌మెంట్

Advertiesment
PNB MetLife

ఐవీఆర్

, మంగళవారం, 2 జులై 2024 (21:33 IST)
భారత్‌లోని ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన పీఎన్‌బీ మెట్‌లైఫ్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత క్లెయిమ్‌లకు సంబంధించి 99.2% క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 99.06 పోలిస్తే వృద్ధి చెందింది. ఈ విజయం కస్టమర్ల ఆర్థిక భద్రత, సంరక్షణపై పీఎన్‌బీ మెట్‌లైఫ్‌కు ఉన్న తిరుగులేని నిబద్ధత, ఫోకస్‌ను నొక్కిచెబుతోంది.
 
2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ మెట్‌లైఫ్ మొత్తం రూ. 462.20 కోట్ల విలువైన 5679 క్లెయిమ్‌లను చెల్లించింది. గత ఐదేళ్లుగా పాలసీదారులకు, వారి కుటుంబాలకు అవసరమైన సమయంలో సత్వరమైన, సమర్థవంతమైన తోడ్పాటును అందించడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చింది. పీఎన్‌బీ మెట్‌లైఫ్ 28,737 లైఫ్ పాలసీలపై వ్యక్తిగత క్లెయిమ్‌ల కోసం రూ.2,106.03 కోట్లను చెల్లించింది, తద్వారా ఆర్థిక భద్రత పరిష్కారాలకు సంబంధించి నమ్మకమైన ప్రొవైడర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
 
పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ & సీఈఓ సమీర్ బన్సాల్ మాట్లాడుతూ, ‘‘పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో, మా కస్టమర్ల ఆర్థిక భద్రత, మనశ్శాంతికి ఇన్సూరెన్స్‌ అనేది ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే, వారు ఆన్‌లైన్‌లో సైన్ ‌అప్ చేయడాన్ని, మా కస్టమర్ సర్వీస్ యాప్ - khUshi ద్వారా పాలసీలను మేనేజ్ చేయడాన్ని, ఇంకా మూడు గంటల్లో క్లెయిమ్‌లను పొందడాన్ని సులభతరం చేశాము. మా 99.2% క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అనేది కస్టమర్ల సంతృప్తి, నిర్వహణ సమర్థత పట్ల మా నిరంతర అంకితభావానికి ఫలితంగా నిలుస్తుంది’’ అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసు పట్ల మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య దురుసు ప్రవర్తన: సీఎం చంద్రబాబు వార్నింగ్ (video)