ప్రముఖ జీవిత బీమా సంస్థ అయిన పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సమీర్ బన్సల్ నియామకాన్ని ఇవాళ ప్రకటించగా, ఈ నియామకం జూలై 1, 2024 నుండి అమలులోకి రానుండగా, ఇందుకు తగిన రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంటుంది.
ఆర్థిక సేవల రంగంలో సమీర్‌కు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండగా, బ్యాంకస్యూరెన్స్, ఏజెన్సీ, డిజిటల్, ఎంప్లాయీ బెనిఫిట్స్ మరియు డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్స్ రంగాలలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌లో ఆయనకు అపారమైన, విజయవంతమైన అనుభవం ఉంది. ఆయన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో 2007లో చేరగా, ప్రస్తుతం చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు, అలాగే నాయకత్వపు బృందంలో సభ్యునిగా ఉన్నారు.
ఆశిష్ శ్రీవాస్తవ అనంతరం సమీర్ ఈ బాధ్యతలు స్వీకరించనుండగా, ఇప్పుడు మెట్‌లైఫ్ ఐఎన్‌సీ సంస్థ యొక్క ఇండియాలోని గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ బృందానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆశిష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. “మా జాయింట్ వెంచర్ కంపెనీకి నాయకత్వం వహించడానికి సమీర్ బన్సల్ నియామకానికి మద్దతు ఇవ్వడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము,” అని వ్యాఖ్యానించిన బోర్డ్ ఛైర్మన్ లిండన్ ఆలివర్, “ఆయన నైపుణ్యం- అనుభవం కలిగిన నాయకుడు, అలాగే పరిశ్రమ- మా వ్యాపారం గురించి ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉండడం అనేది పీఎన్‌బీ మెట్‌లైఫ్ దినదినప్రవర్ధమానం చెందడాన్ని అది నిర్ధారిస్తుంది,” అన్నారు.
భారతదేశంలో బ్యాంక్ భాగస్వామ్యాల ద్వారా అతిపెద్ద బ్యాంకస్యూరెన్స్ నెట్‌వర్క్‌లలో ఒకటి, అలాగే 18,600కి పైగా ప్రాంతాలలో 149 శాఖలతో సేవలు అందిస్తున్న మెట్‌లైఫ్‌కు, కీలకమైన మార్కెట్‌లో వ్యాపార వృద్ధికి సమీర్ నాయకత్వం వహిస్తారు. “ఈ పాత్రను స్వీకరించడం నాకు ఎంతో గౌరవం. వేగంగా మారుతున్న పోటీ మార్కెట్‌లో, మేము గణనీయమైన అవకాశాలతో ఉన్నాము. మిల్‌కర్ లైఫ్ ఆగే బఢే (ఉమ్మడిగా జీవితంలో ముందుకు సాగుదాం) అనే మా ఉద్దేశ్యం ప్రకారం మా కస్టమర్‌లకు, మా వాటాదారులకు సర్కిల్ ఆఫ్ లైఫ్ వాగ్దానాన్ని అందించడం కోసం మా కంపెనీకి నాయకత్వం వహించడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను,” అని సమీర్ బన్సల్ అన్నారు.