Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమటోడ్చి ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు రోజర్ ఫెదరర్

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (12:52 IST)
కొన్నేళ్లుగా టెన్నిస్ ఆడుతున్న రోజర్ ఫెదరర్.. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌లో 22వ సంవత్సరం ఆడుతున్న ఫెదరర్‍‌కు మూడవ రౌండ్‌లో గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ శ్రమించి విజయం సాధించాడు. తద్వారా ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. 
 
మూడో రౌండ్‌లో వరల్డ్ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో తలపడిన ఫెదరర్, 6-4, 6-4, 5-7, 6-4 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లనూ ఫెదరర్ సునాయాసంగా గెలుచుకున్నప్పటికీ, మూడవ రౌండ్ లో కామెరాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. 
 
ఫెదరర్ ఎంతగా శ్రమించినా, కామెరాన్ తలొగ్గలేదు. దీంతో సెట్ కామెరాన్ వశమైంది. ఆపై కీలకమైన నాలుగో సెట్‌లో ఫెదరర్, మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించి, ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో కామెరాన్‌కు ఓటమి తప్పలేదు. దాదాపు 2.35 గంటల పాటు జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఫెదరర్, నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
 
ఈ మ్యాచ్‌లో ఫెదరర్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. 38 సార్లు నెట్ వద్దకు దూసుకువచ్చిన ఫెడ్, 30 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈ గెలుపుతో 1969లో యూఎస్ ఆటగాడు పాంచో గొంజాలెస్, 1975లో ఆస్ట్రేలియాకు చెందిన కెన్ రోజ్ వెల్ రికార్డులకు ఫెదరర్ దగ్గరయ్యాడు. వీరిద్దరూ 40 ఏళ్లు దాటిన తర్వాత వింబుల్డన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంపికకాగా, వారి తర్వాత మూడవ పెద్ద వయస్కుడిగా ఫెడ్ నిలిచాడు.
 
మరో మ్యాచ్‌లో రెండు సార్లు వింబుల్డన్ చాంప్‌గా నిలిచిన ఆండీ ముర్రే, పదో సీడ్, కెనడాకు చెందిన షపవలోవ్ చేతిలో 6-4, 6-4, 6-2 తేడాతో ఓడిపోయాడు. ముర్రే 2013, 2016 టోర్నీల్లో వింబుల్డన్ ట్రోఫీని సాధించారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments