Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచకప్ క్లాసిక్‌.. 90 నిమిషాల్లో 7 గోల్స్, 8 ఎల్లో కార్డులు.. కేటీఆర్

ఫిఫా వరల్డ్ కప్ తొలి నాకౌట్ పోటీలో శనివారం జర్మనీతో తలపడిన అర్జెంటీనా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 4 - 3 తేడాతో అర్జెంటీనా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌పై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మ్యాచ

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (14:27 IST)
ఫిఫా వరల్డ్ కప్ తొలి నాకౌట్ పోటీలో శనివారం జర్మనీతో తలపడిన అర్జెంటీనా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 4 - 3 తేడాతో అర్జెంటీనా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌పై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మ్యాచ్‌ని ప్రపంచకప్ క్లాసిక్‌గా అభివర్ణించారు.


90 నిమిషాల్లో 7 గోల్స్, 8 ఎల్లో కార్డులు జారీ కావడాన్ని గుర్తు చేశారు. ఈ మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించిన 31 ఏళ్ల లియోనల్ మెస్సీ తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. దీనిపై నెటిజన్లంతా మండిపడ్డారు. 
 
మెస్సీకి ఇదే ఆఖరి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కావొచ్చు. కాగా, కేటీఆర్ ఓ ట్వీట్ చేస్తూ.. అందుకే ఈ ఆట ఎంతో ప్రత్యేకం. 90 నిమిషాలు, 7 గోల్స్ అండ్ 8 ఎల్లో కార్డ్స్.. మరో ఫిఫా ప్రపంచకప్ క్లాసిక్" అని వ్యాఖ్యానించారు. ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో 8 మ్యాచ్‌లు ఆడిన మెస్సి.. వీటిలో ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. ఇదిలా వుంటే కేవలం గోల్స్‌ లెక్కను బట్టి ఏ ఆటగాడి సత్తానూ అంచనా వేయలేమని క్రీడా పండితులు అంటున్నారు.
 
డీగో మారడోనా తర్వాత మళ్లీ అర్జెంటీనాకు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అంతటి ఆకర్షణ తెచ్చిన ఆటగాడు మెస్సీ. కానీ మారడోనాలా ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. గత కొన్ని పర్యాయాల నుంచి అర్జెంటీనా జట్టులో ఎవరున్నా లేకున్నా.. అతడి ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటిగా ఉంటోందంటే అందుకు మెస్సీనే కారణం. అతడి ఆట కోసమే అర్జెంటీనాను అనుసరించే వాళ్లు కోట్ల మంది. అయితే మెస్సీ నిష్క్రమణతో ఇకపై ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆకర్షణ మొత్తం పోతుందనడంలో అనుమానం లేదని క్రీడా పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

తర్వాతి కథనం
Show comments